|
| భవాని
స్తోతుం త్వాం ప్రభవతి చతుర్భిర్న వదనైః |
| ప్రజానామీశాన
స్త్రిపురమథన పంచభిరపి |
| నషడ్బి
స్సేనానీ ర్దశశతముఖై రప్యహి పతిః |
| తదా
న్యేషాం కేషాం కథయ కథ మస్మిన్నవసరః |
|
| ఓ
జగదేకమాత భవానీ సృష్టికర్త బ్రహ్మ తన నాలుగు ముఖాలతోను, |
| త్రిపురహరుడు
శంకరుడు తన అయిదు ముఖాలతోను, దేవసేనాని |
| కుమారస్వామి
తన ఆరు ముఖాలతోను, నాగరాజైన ఆదిశేషుడు తన |
| వేయిముఖాల
తోను నీ మహిమా పాఠావాలను వర్ణింపలేకున్నారు. ఇక |
| మానవమాత్రుడను
నేనెంతటివాడను. |
|
| ఘతక్షీర
- ద్రాక్షా మధుమధురిమా కై రపి పదై |
| ర్విశిష్యా
నాఖ్యేయో భవతి రసనా మాత్రవిషయః |
| తథాతే
సౌందర్యం పరమశివ దృజ్మత్ర విషయః |
| కథంకారం
బ్రూమ సకల నిగమా గోచరపదే. |
|
| నెయ్యి,పాలు,ద్రాక్షా
- తేనెలలోని మాధుర్యాన్ని వర్ణించేందుకు మాటలు |
| చాలవు.వాటి
రుచి నాలుకకు మాత్రమే తెలుసు. అమ్మానీ సౌందర్యం |
| వర్ణించాలంటే
సకల వేదాలకే శక్తి చాలదే.ఆ సౌందర్యాతిశయం |
| మహేశ్వరునికి
ఎరుకగానీ - మా బోటి సామాన్యుల తరమా తల్లీ! |
|
| ముఖతే
తాంబూలం నయనయుగళే కజ్జలకలా |
| లలాటే
కాశ్మీరం విలసతి గలే మౌక్తిక లతా |
| స్ఫురత్కాంచీశాటీ
పృథుకటితటే హాటకమయీ |
| భజామి
త్వాం గౌరీం నగపతి కిశోరీ మవిరతమ్. |
|
| నోట్లో
తాంబూలం, కళ్లకు కాటుక,నొసట సిందూర తిలకం, మెడలో |
| మంచి
ముత్యాలహారం, బంగారు జలతారుతో నేయబడిన చీరె, |
| నడుమున
రత్నాలు తాపిన వడ్యాణాన్ని ధరించి; ధగధగ మెరిసే వేష |
| భూషలతో
విరాజిల్లే గిరిరాజ నందినీ! గౌరవర్ణినీ! సదా మనసా నిన్నే |
| ఆరాధిస్తాను
తల్లీ! |
|
| విరాజన్మందార
ద్రుమ కుసుమహార స్తనతటి |
| నదద్వీణానాద
శ్రవణ విలసత్ కుండల గుణా |
| నతాంగీ
మాతంగీ రుచిరగతి భంగీ భగవతీ |
| సతీ
శంభో రంభోరుహ చటుల చక్షుర్విజయతే. |
|
| మందారకుసుమమాల
ధరించి హృదయసీమను మధుర వీణానాదాన్ని |
| ఆలకిస్తూ
- చెవుల తళతళ మెరిసే కుండల కాంతుల శోభతో .... |
| వయ్యారంగా
వంగిన తనువుతో, ఆడయేనుగు అందమైన నడకతో .... |
| మనోహరమైన
మందగమనంతో, కలువ కన్నుల మంగళస్వరూపినీ! హే |
| భగవతీ
శంకరసతీ .... సర్వత్రా నీ రూపమే నాకు కనులముందు |
| కదులాడుతోంది
తల్లీ! |
|
| నవీనార్క
భ్రాజన్మణి కనక భూషా పరికరైః |
| వృతాంగీ
సారంగీ రుచిర నయనాం గీకృత శివా, |
| తటిత్పీతా
పీతాంబర లలిత మంజీర సుభగా |
| మమా
పర్ణాపూర్ణా నిరవధిసుఖైరస్తు సుముఖీ! |
|
| హే
జగన్మాతా! అప్పుడే! ఉదయించిన భాలభానునిలా దేదీప్యమానంగా |
| ప్రకాశించే
సువర్ణ మణిమయాది భూషణాలతో సర్వాంగ భూషితవు. |
| ఆడులేడి
కళ్ళవంటి అత్యంత సుందరమైన కన్నులు గలదానావు, |
| పరమశివుని
పతిగా స్వీకరించిన దానవు, మెరుపు లాంటి పచ్చని |
| మేని
కాంతికల దానవు, పసిడి పీతాంబరం, పాదమంజీరాలతో కలకల్లాడే |
| అయిదవరాలా
ఆనంద స్వరూపిణీ! అపర్ణా .... నిరంతరం నాకు నిండుగా |
| ఆనందాన్ని
యిమ్ము తల్లీ! |
|
| హిమాద్రే
స్సంభూతా సులలితకరైః పల్లవయుతా |
| సుపుష్పా
ముక్తాభి ర్ర్బమరకలితా చాలకభరైః, |
| కృతస్థాణు
స్థానా కుచఫలనతా సూక్తిసరసా |
| రుజాం
హస్త్రీ విలసతి చిదానందలతికా. |
|
|
| ఆ మాత
జ్ఞానలత, ఆనందలత, మంచుకొనలో పుట్టినది. అందమైన |
| అరచేతులనే
పల్లవాలు కలది. ముత్యాల సరాలనే పూలు పూసింది. నల్లని |
| తుమ్మెద
దలనే ముంగురులతో ముచ్చటగొలిపేది. స్తన ఫలభారంతో |
| వంగినటువంటిది.
సరసవాక్కుల తేనె లొలికించు నట్టి దా లత ... |
| సర్వరోగ
నివారిణి, కలుషహారిణి ... అది జ్ఞానానంద లతిక -- శివ మనోవల్లరి. |
|
| సపర్ణా
మాకీర్ణాంకతిపగుణై స్సాదర మిహ |
| శ్రయం
త్యన్యే వల్లీం మమతు మతిరేవం విలసతి, |
| అపర్ణైకా
సేవ్యా జగతి సకలై ర్యత్పరివృతః |
| పురాణోపి
స్థాణుః ఫలతికిల కైవల్యపదవీమ్. |
|
| ఇహం లొ
తరించాలంటే అపర్ణనే కొలవాలి కాని సపర్ణను కాదు. ఆ |
| అపర్ణను
పరిణయమాడిన పరమశివుడు మోక్షఫలప్రదాత అయ్యాడు
కదా! |
|
| విధాత్రీ
ధర్మాణాం త్వమసి సకలామ్నాయ జననీ! |
| త్వమర్థానాం
మూలం ధనద, నమనీయాంఘ్రికమలే! |
| త్వమాదిః
కామానాం జనని! కృత కందర్ప విజయే! |
| సతాం
ముక్తేర్బీజం త్వమసి పరమబ్రహ్మ మహిషీ! |
|
| ఓ
జగదేకమాత! వేదాలన్నీ నేలోనే జనించాయి. సకల వేదవిధులను |
| విధించుదానవు.
ధనాధిపతి కుబేరుడు కూడా నీ పాదాక్రాంతుడే. నీవు |
| కామేశ్వరివి.
కోరికలు తీర్చే దానవు. కాముని జయించిన దానవు. |
| పరబ్రహ్మస్వరూపుని
పట్టపురాణివి గదమ్మా! సజ్జనుల ముక్తికి |
| కారణభూతురాలవు...ధర్మ
అర్థ కామ మోక్షాలనే చతుర్విధపురుషార్థ |
| ఇచ్చేదానివి
నీవే తల్లీ! |
| ప్రభుతా
భక్తిస్తే యదపి న మయా లోలమనసః |
| త్వయాతు
శ్రీమత్యా సదయమవలోక్యో హమధునా |
| పయోదః
పానీయం దిశతి మధురం చాతకముఖే, |
| భృశం
శంకే కైర్వా విధిభి రనునీతా మమ మతిః |
|
|
|
| చపలచిత్తుడనైన
నాకు నిజం చెప్పాలంటే నీయందంతగా భక్తి కుదరడం |
| లేదు.
కానీ నీవు పెద్ద మనస్సున్న దానవు...శ్రీ మతివి. నీవే నన్నిపుడు |
| దయచూడాలి
తల్లీ!. చాతక పక్షి ఇష్టాయిష్టాలకు అతీతంగా మేఘుడు |
| చాతకపక్షినోట
తీయటి జలాలను కురిపించటం లేదా! అలాగే |
| దయావర్షం
నాపై కురిపించు తల్లీ! ఎందువల్ల నా మనస్సు నీ యందు |
| నిలకడ
కోల్పోతోందో అని సతతము మథనపడుతున్నాను తల్లీ! |
|
| కృపా
పాంగాలోకం వితర తరసా సాధుచరితే |
| నతే
యుక్తో పేక్షామయి శరణదీక్షా ముపగతే |
| నచే
దిష్టం దద్యా దనుపద మహో! కల్పలతికా |
| విశేషస్సామాన్యైః
కథ మితర వల్లీపరకరైః |
|
| అమ్మా
నీవు కపట మెరుగని సచ్చరిత్రవు గదమ్మా! నీ కృపాదృష్టిని నాపై |
| త్వరగా
ప్రసరింపజేయుము తల్లీ! నిన్ను శరణు కోరినవారిని కరుణించే |
| కల్పవల్లివి
గదమ్మా...నన్ను ఉపేక్షించకమ్మా! అడిగిందే తడవుగా వరాలిచ్చే |
| కల్పవల్లీ!
ఈ యకుంటే సామాన్యతలకు కల్పలతకు తేడా ఏముంటుంది తల్లీ! |
|
| మహాంతం
విశ్వాసం తవ చరణ పంకేరుహయుగే |
| నిధాయా
న్యన్నైవా శ్రిత మహ మయా దైవతముమే! |
| తథాపి
త్వచ్చేతో యది మయి న జాయేత సదయం |
| నిరాలంబో
లంబోదర జనని కం యామి శరణమ్. |
|
| అమ్మా...ఉమాదేవీ!
నీ పాదపద్మాలనే నమ్ముకున్నా నమ్మా! ఇతర దేవతల |
| నాశ్రయించాలను
కోలేదు. అయినా నాపై నీకు దయరాకపోతే, నే |
| నిరాశ్రయుడనై
పోతానమ్మా! హే లంబోదర జననీ ఏ యాధారమూ లేని |
| నన్ను
ఎవరిని శరణు వేడుకోమంటావు తల్లీ! |
|
| అయి
స్పర్శే లగ్నం సపది లభతే హేమపదవీం |
| యథా
రథ్యాపాద శ్శుచి భవతి గంగౌఘమిలితం |
| తథా
తత్త త్పాపై రతిమలిన మంతర్మమ యది |
| త్వయి
ప్రేమ్ణాస్తం కథమివ న జాయేత విమలమ్. |
|
| అమ్మా!
స్పర్శవేది సోకగానే ఇనుము బంగార మవుతుంది. వీధి కాల్వల్లో |
| పారే
మురికినీరు గంగతో కలసి పునీతం అవుతుంది. అదేవిధంగా |
| మాయను
జిక్కి పాపాలతో మలినమైపోయిన నా మనస్సు - భక్తిభావనలో |
| ముణిగినపుడు
అదిమాత్రం నిర్మలం కాకపోతుందా ...తల్లీ! |
|
| త్వదన్యస్మా
దిచ్చావిషయ ఫలలాభే న నియమః |
| త్వమర్థనా
మిచ్చాధికమపి సమర్థా వితరణే |
| ఇతి
ప్రాహుః ప్రాంచః కమలభవనాద్యాస్త్వయి మన |
| స్త్వదాసక్తం
నక్తం దివ ముచిత మీశాని! కురతత్ |
|
| ఓ
ఈశ్వరీ నిన్ను కాదని అన్యదేవతలను వేడను. వేడినంత మాత్రాన |
| కోరిన
కోర్కెలన్నీ తీరతాయని నమ్మకము లేదు. అదే నీవైతే - తెలియని |
| మూర్ఖులు
తమ శక్తి మించి కోరిన కోరికలు కూడ నిండు మనసుతో |
| తీరుస్తావు
- ఇది బ్రహ్మాదులు చెప్పిన సత్యం. హే జగన్మాతా నా మనస్సు |
| రేయింబవళ్ళు
నీ పైనే లగ్నమైంది తల్లీ... ఇప్పుడు నాకేది ఉచితమని |
| భావిస్తావో
దాని ననుగ్రహించు తల్లీ! |
|
| స్ఫురన్నానారత్న
సఫటికమయ భిత్తి ప్రతిఫల |
| త్త్వదాకారం
చంచచ్చ శధరకలా సౌధశిఖరం, |
| ముకుంద
బ్రహ్మేంద్ర ప్రభృతి పరివారం విజయతే, |
| తవా
గారం రమ్యం తిభువన మహారాజగృహిణి! |
|
| త్రిభువన
నాయకుడైన పరమేశ్వరుని పట్టాపురాణివైన జగజ్జననీ! నీ |
| భవనమేంతో
రమ్యమైంది! రత్నప్రాకారాలతో - స్పటిక మణిమయ |
| గోడలతో,
అన్నిటా నీ రూపమే ప్రతిబింబిస్తూ కనులకింపుగా వుంది. నీ |
| సౌధశిఖరం
చంద్రుని కాంతులతో మిలమిల మెరిసిపోతున్నది! విష్ణువు |
| బ్రహ్మ,
ఇంద్రాది దేవతా పరివారంతో నీ భవనం ఎంత మహోజ్జ్వలంగా |
| ఉన్నదితల్లీ! |
|
| నివాసః
కైలాసే విధి శతమఖాద్యా స్స్తుతికరాః |
| కుటుంబం
త్రైలోక్యం కృతకరపుట స్సిద్ధినికరః, |
| మహేశ
ప్రాణేశ స్తదవనిధరా ధీశ తనయే |
| న తే
సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్తితులనా. |
|
| మాతా!
పర్వతరాజకుమారి..మాతా భవానీ! నీ నివాసం కైలాసం. |
| రజతగిరి
అనబడే వెండి కొండ...బ్రహ్మేంద్రాదులు నీ గుణగానం చేసే |
| వైతాళికులు.
ముల్లోకాలు నీ కుటుంబమే. అణిమాది అష్టసిద్ధులు |
| అంజలి
ఘటించి నీ యెదుట నిలబడి ఉన్నాయి. మహేశ్వరుడు - నీ |
| ప్రాణనాధుడు.
నీ సౌభాగ్యానికి సాటి ఎక్కడుంది తల్లీ! |
|
| వృషో
వృద్ధో యానం విషమశన మాశా నివాసనం |
| స్మశానం
క్రీడాభూ ర్భుజగనివహో భూషణ విధిః |
| సమగ్రాసామగ్రీ
జగతి విదితైవ స్మరరిపో |
| ర్యదేత
స్యైశ్యర్యం తవ జనని సౌభాగ్యమహిమా! |
|
| అమ్మా!మన్మధుని
బూడిదచేసిన ఆ శంకరుని వాహనమా ముసలి ఎద్దు |
| ...ఆహారమా
విషము...కట్టుపుట్టములా దిక్కులు..విహార భూమి - |
| స్మశానవాటిక,
సొమ్ములా పాముల తుట్టెలు...ఆయనకున్న |
| భాగ్యమేపాటిదో
ఎల్లలోకాలు ఎగిరినదే గదా! అయినప్పటికి ఆయన |
| మహా
ఐశ్వర్యవంతుడు .. తాను బూడిద పూసుకున్నా ఇతరులకు భూతి |
| నివ్వగల
సంపన్నుడు. దీనికి నీ సౌభాగ్యమహిమే కారణం తల్లీ! |
| |
| అశేష
బ్రహ్మాండ ప్రలయ విధి నైసర్గిక మతిః |
| స్మశానేష్వాసీనః
కృత భసితలేపః పశుపతిః, |
| దధౌ
కంఠే, హాలాహల మఖిలభూగోల కృపయా |
| భవత్యా
స్సంగత్యాః ఫల మితిచ కల్యాణీ! కలయే. |
|
| హే
మంగళప్రదాయినీ - కల్యాణీ! దేహమంతా విబూది పూసుకుని |
| స్మశానంలో
తిష్టవేసికూర్చునే శివుడు సర్వలోకాలను సంహారకర్త అని |
| ప్రళయం
కలిగిస్తాడని పేరు..కానీ, ఆ శివుడే సకల జీవరాసులను |
| కాపాడాలని
కాలకుటాన్ని మ్రింగి కంఠాన బెట్టుకుని, సమస్త |
| భూగోళాన్ని
దయామయుడై కాపాడాడంటే - అదంతా నీ చలవే - |
| సర్వమంగళదాయినీ
.. నీతోడి సాంగత్యమే అందుకు కారణమని |
| భావిస్తున్నాను
తల్లీ! |
|
| విశాల
శ్రీఖండ ద్రవ మృగమదా కీర్ణఘుసృణ |
| ప్రసూన
వ్యమిశ్రం భగవతి! తవాభ్యంగ సలిలం |
| సమాదాయ
స్రష్టా చలితపదపాంసూ న్నిజకరైః |
| సమాధత్తే
సృష్టిం విబుధపుర పంకేరుహ దృశామ్. |
|
| హే
భగవతీ! మంచిగంధపు రసం, కస్తూరి, కుంకుమ పూవుతో కూడిన |
| నీ
తలంటి స్నానజలాన్ని, నీ పాదరజాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా తన |
| చేతులతో
గ్రహించి ఆ స్నానజలంలోని నీ పాదధూళిని కలిపి పదునుచేసి |
| దేవలోకంలో
కలువరేకులవంటి కన్నులు గల కాంతామణులను సృష్టిస్తున్నాడు - తల్లీ! |
|
| వసంతే
సానందే కుసుమిత లతాభిః పరివృతే |
| స్ఫురన్నానాపద్మే
సరసి కలహంసాలి సుభగే, |
| సఖీభిః
ఖేలంతీం మలయపవనాందోలిత జలే |
| స్మరేద్యస్త్వాం
తస్య జ్వరజనిత పీడా పరపతి. |
|
| తల్లీ
జ్వరబాధ శాంతించాలంటే, ఆనందదాయకమైన వసంత |
| ఋతువులో
- విరబూసిన లతతో - వికసించిన పద్మాలతో కలహంసల |
| బూరులతో
కలకల్లాడే సరోవరంలో - మలయపవన వీచికలతో |
| మెల్లిమెల్లిగా
కదులుతున్న జలాల్లో చెలులతో జలక్రీడలు చేస్తున్న |
| జగన్మాతను
ధ్యానించిన వారికి జ్వరపీడ తొలగిపోతుంది |
| ఇతి
శ్రీ శంకరాచార్య కృత - ఆనందలహరీ స్తోత్రం సంపూర్ణమ్. |
No comments:
Post a Comment