Wednesday, September 24, 2014


http://www.teluguone.com/tonecmsuserfiles/somu%281%29.png
                                      ఆనందలహరీ
 భవాని స్తోతుం త్వాం ప్రభవతి చతుర్భిర్న వదనైః
ప్రజానామీశాన  స్త్రిపురమథన పంచభిరపి
నషడ్బి స్సేనానీ ర్దశశతముఖై రప్యహి పతిః
తదా న్యేషాం కేషాం కథయ కథ మస్మిన్నవసరః

ఓ జగదేకమాత భవానీ సృష్టికర్త బ్రహ్మ తన నాలుగు ముఖాలతోను,
త్రిపురహరుడు శంకరుడు తన అయిదు ముఖాలతోను, దేవసేనాని
కుమారస్వామి తన ఆరు ముఖాలతోను, నాగరాజైన ఆదిశేషుడు తన
వేయిముఖాల తోను నీ మహిమా పాఠావాలను వర్ణింపలేకున్నారు. ఇక
మానవమాత్రుడను నేనెంతటివాడను.

ఘతక్షీర - ద్రాక్షా మధుమధురిమా కై రపి పదై
ర్విశిష్యా నాఖ్యేయో భవతి రసనా మాత్రవిషయః
తథాతే సౌందర్యం పరమశివ దృజ్మత్ర విషయః
కథంకారం బ్రూమ సకల నిగమా గోచరపదే.

నెయ్యి,పాలు,ద్రాక్షా - తేనెలలోని మాధుర్యాన్ని వర్ణించేందుకు మాటలు
చాలవు.వాటి రుచి నాలుకకు మాత్రమే తెలుసు. అమ్మానీ సౌందర్యం
వర్ణించాలంటే సకల వేదాలకే శక్తి చాలదే.ఆ సౌందర్యాతిశయం
మహేశ్వరునికి ఎరుకగానీ - మా బోటి సామాన్యుల తరమా తల్లీ!

ముఖతే తాంబూలం నయనయుగళే కజ్జలకలా
లలాటే కాశ్మీరం విలసతి గలే మౌక్తిక లతా
స్ఫురత్కాంచీశాటీ పృథుకటితటే హాటకమయీ
భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీ మవిరతమ్.

నోట్లో తాంబూలం, కళ్లకు కాటుక,నొసట సిందూర తిలకం, మెడలో
మంచి ముత్యాలహారం, బంగారు జలతారుతో నేయబడిన చీరె,
నడుమున రత్నాలు తాపిన వడ్యాణాన్ని ధరించి; ధగధగ మెరిసే వేష
భూషలతో విరాజిల్లే గిరిరాజ నందినీ! గౌరవర్ణినీ! సదా మనసా నిన్నే
ఆరాధిస్తాను తల్లీ!

విరాజన్మందార ద్రుమ కుసుమహార స్తనతటి
నదద్వీణానాద శ్రవణ విలసత్ కుండల గుణా
నతాంగీ మాతంగీ రుచిరగతి భంగీ భగవతీ
సతీ శంభో రంభోరుహ చటుల చక్షుర్విజయతే.

మందారకుసుమమాల ధరించి హృదయసీమను మధుర వీణానాదాన్ని
ఆలకిస్తూ - చెవుల తళతళ మెరిసే కుండల కాంతుల శోభతో ....
వయ్యారంగా వంగిన తనువుతో, ఆడయేనుగు అందమైన నడకతో ....
మనోహరమైన మందగమనంతో, కలువ కన్నుల మంగళస్వరూపినీ! హే
భగవతీ శంకరసతీ .... సర్వత్రా నీ రూపమే నాకు కనులముందు
కదులాడుతోంది తల్లీ! 

నవీనార్క భ్రాజన్మణి  కనక భూషా పరికరైః
వృతాంగీ సారంగీ రుచిర నయనాం గీకృత శివా,
తటిత్పీతా పీతాంబర లలిత మంజీర సుభగా
మమా పర్ణాపూర్ణా నిరవధిసుఖైరస్తు సుముఖీ!

హే జగన్మాతా! అప్పుడే! ఉదయించిన భాలభానునిలా దేదీప్యమానంగా
ప్రకాశించే సువర్ణ మణిమయాది భూషణాలతో సర్వాంగ భూషితవు.
ఆడులేడి కళ్ళవంటి అత్యంత సుందరమైన కన్నులు గలదానావు,
పరమశివుని పతిగా స్వీకరించిన దానవు, మెరుపు లాంటి పచ్చని
మేని కాంతికల దానవు, పసిడి పీతాంబరం, పాదమంజీరాలతో కలకల్లాడే
అయిదవరాలా ఆనంద స్వరూపిణీ! అపర్ణా .... నిరంతరం నాకు నిండుగా
ఆనందాన్ని యిమ్ము తల్లీ!

హిమాద్రే స్సంభూతా సులలితకరైః పల్లవయుతా
సుపుష్పా ముక్తాభి ర్ర్బమరకలితా చాలకభరైః,
కృతస్థాణు స్థానా కుచఫలనతా సూక్తిసరసా
రుజాం హస్త్రీ విలసతి చిదానందలతికా.


ఆ మాత జ్ఞానలత, ఆనందలత, మంచుకొనలో పుట్టినది. అందమైన
అరచేతులనే పల్లవాలు కలది. ముత్యాల సరాలనే పూలు పూసింది. నల్లని
తుమ్మెద దలనే  ముంగురులతో ముచ్చటగొలిపేది. స్తన ఫలభారంతో
వంగినటువంటిది. సరసవాక్కుల తేనె లొలికించు నట్టి దా లత ...
సర్వరోగ నివారిణి, కలుషహారిణి ... అది జ్ఞానానంద లతిక -- శివ మనోవల్లరి.

సపర్ణా మాకీర్ణాంకతిపగుణై స్సాదర మిహ
శ్రయం త్యన్యే వల్లీం మమతు మతిరేవం విలసతి,
అపర్ణైకా సేవ్యా జగతి సకలై ర్యత్పరివృతః
పురాణోపి స్థాణుః  ఫలతికిల కైవల్యపదవీమ్.

ఇహం లొ తరించాలంటే అపర్ణనే కొలవాలి కాని సపర్ణను కాదు. ఆ
అపర్ణను పరిణయమాడిన పరమశివుడు మోక్షఫలప్రదాత అయ్యాడు కదా!        

విధాత్రీ ధర్మాణాం త్వమసి సకలామ్నాయ జననీ!
త్వమర్థానాం మూలం ధనద, నమనీయాంఘ్రికమలే!
త్వమాదిః కామానాం జనని! కృత కందర్ప విజయే!
సతాం ముక్తేర్బీజం త్వమసి పరమబ్రహ్మ మహిషీ!

ఓ జగదేకమాత! వేదాలన్నీ నేలోనే జనించాయి. సకల వేదవిధులను
విధించుదానవు. ధనాధిపతి కుబేరుడు కూడా నీ పాదాక్రాంతుడే. నీవు
కామేశ్వరివి. కోరికలు తీర్చే దానవు. కాముని జయించిన దానవు.
పరబ్రహ్మస్వరూపుని పట్టపురాణివి గదమ్మా! సజ్జనుల ముక్తికి
కారణభూతురాలవు...ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధపురుషార్థ
ఇచ్చేదానివి నీవే తల్లీ!
ప్రభుతా భక్తిస్తే యదపి న మయా లోలమనసః
త్వయాతు శ్రీమత్యా సదయమవలోక్యో హమధునా
పయోదః పానీయం దిశతి మధురం చాతకముఖే,
భృశం శంకే కైర్వా విధిభి రనునీతా మమ మతిః



చపలచిత్తుడనైన నాకు నిజం చెప్పాలంటే నీయందంతగా భక్తి కుదరడం
లేదు. కానీ నీవు పెద్ద మనస్సున్న దానవు...శ్రీ మతివి. నీవే నన్నిపుడు
దయచూడాలి తల్లీ!. చాతక పక్షి ఇష్టాయిష్టాలకు అతీతంగా మేఘుడు
చాతకపక్షినోట తీయటి జలాలను కురిపించటం లేదా! అలాగే
దయావర్షం నాపై కురిపించు తల్లీ! ఎందువల్ల నా మనస్సు నీ యందు
నిలకడ కోల్పోతోందో అని సతతము మథనపడుతున్నాను తల్లీ!

కృపా పాంగాలోకం వితర తరసా సాధుచరితే
నతే యుక్తో పేక్షామయి శరణదీక్షా ముపగతే
నచే దిష్టం దద్యా దనుపద మహో! కల్పలతికా
విశేషస్సామాన్యైః కథ మితర వల్లీపరకరైః

అమ్మా నీవు కపట మెరుగని సచ్చరిత్రవు గదమ్మా! నీ కృపాదృష్టిని నాపై
త్వరగా ప్రసరింపజేయుము తల్లీ! నిన్ను శరణు కోరినవారిని కరుణించే
కల్పవల్లివి గదమ్మా...నన్ను ఉపేక్షించకమ్మా! అడిగిందే తడవుగా వరాలిచ్చే
కల్పవల్లీ! ఈ యకుంటే సామాన్యతలకు కల్పలతకు తేడా ఏముంటుంది తల్లీ!

మహాంతం విశ్వాసం తవ చరణ పంకేరుహయుగే
నిధాయా న్యన్నైవా శ్రిత మహ మయా దైవతముమే!
తథాపి త్వచ్చేతో యది మయి న జాయేత సదయం
నిరాలంబో లంబోదర జనని కం యామి శరణమ్.

అమ్మా...ఉమాదేవీ! నీ పాదపద్మాలనే నమ్ముకున్నా నమ్మా! ఇతర దేవతల
నాశ్రయించాలను కోలేదు. అయినా నాపై నీకు దయరాకపోతే, నే
నిరాశ్రయుడనై పోతానమ్మా! హే లంబోదర జననీ ఏ యాధారమూ లేని
నన్ను ఎవరిని శరణు వేడుకోమంటావు తల్లీ!

అయి స్పర్శే లగ్నం సపది లభతే హేమపదవీం
యథా రథ్యాపాద శ్శుచి భవతి గంగౌఘమిలితం
తథా తత్త త్పాపై రతిమలిన మంతర్మమ యది
త్వయి ప్రేమ్ణాస్తం కథమివ న జాయేత విమలమ్. 

అమ్మా! స్పర్శవేది సోకగానే ఇనుము బంగార మవుతుంది. వీధి కాల్వల్లో
పారే మురికినీరు గంగతో కలసి పునీతం అవుతుంది. అదేవిధంగా
మాయను జిక్కి పాపాలతో మలినమైపోయిన  నా మనస్సు - భక్తిభావనలో
ముణిగినపుడు అదిమాత్రం నిర్మలం కాకపోతుందా ...తల్లీ!

త్వదన్యస్మా దిచ్చావిషయ ఫలలాభే న నియమః
త్వమర్థనా మిచ్చాధికమపి సమర్థా వితరణే
ఇతి ప్రాహుః  ప్రాంచః కమలభవనాద్యాస్త్వయి మన
స్త్వదాసక్తం నక్తం దివ ముచిత మీశాని! కురతత్ 

ఓ ఈశ్వరీ నిన్ను కాదని అన్యదేవతలను వేడను. వేడినంత మాత్రాన
కోరిన కోర్కెలన్నీ తీరతాయని నమ్మకము లేదు. అదే నీవైతే - తెలియని 
మూర్ఖులు తమ శక్తి మించి కోరిన కోరికలు కూడ నిండు మనసుతో
తీరుస్తావు - ఇది బ్రహ్మాదులు చెప్పిన సత్యం. హే జగన్మాతా నా మనస్సు
రేయింబవళ్ళు నీ పైనే లగ్నమైంది తల్లీ... ఇప్పుడు నాకేది ఉచితమని
భావిస్తావో దాని ననుగ్రహించు తల్లీ!

స్ఫురన్నానారత్న సఫటికమయ భిత్తి ప్రతిఫల
త్త్వదాకారం చంచచ్చ శధరకలా సౌధశిఖరం,
ముకుంద బ్రహ్మేంద్ర  ప్రభృతి పరివారం విజయతే,
తవా గారం రమ్యం తిభువన మహారాజగృహిణి!

త్రిభువన నాయకుడైన పరమేశ్వరుని పట్టాపురాణివైన జగజ్జననీ! నీ
భవనమేంతో రమ్యమైంది! రత్నప్రాకారాలతో - స్పటిక మణిమయ
గోడలతో, అన్నిటా నీ రూపమే ప్రతిబింబిస్తూ కనులకింపుగా వుంది. నీ
సౌధశిఖరం చంద్రుని కాంతులతో మిలమిల మెరిసిపోతున్నది! విష్ణువు
బ్రహ్మ, ఇంద్రాది దేవతా పరివారంతో నీ భవనం ఎంత మహోజ్జ్వలంగా
ఉన్నదితల్లీ!

నివాసః కైలాసే విధి శతమఖాద్యా స్స్తుతికరాః
కుటుంబం త్రైలోక్యం కృతకరపుట స్సిద్ధినికరః,
మహేశ ప్రాణేశ స్తదవనిధరా ధీశ తనయే
న తే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్తితులనా. 

మాతా! పర్వతరాజకుమారి..మాతా భవానీ! నీ నివాసం కైలాసం.
రజతగిరి అనబడే వెండి కొండ...బ్రహ్మేంద్రాదులు  నీ గుణగానం చేసే
వైతాళికులు. ముల్లోకాలు నీ కుటుంబమే. అణిమాది అష్టసిద్ధులు
అంజలి ఘటించి నీ యెదుట నిలబడి ఉన్నాయి. మహేశ్వరుడు - నీ
ప్రాణనాధుడు. నీ సౌభాగ్యానికి సాటి ఎక్కడుంది తల్లీ!

వృషో వృద్ధో యానం విషమశన మాశా నివాసనం
 స్మశానం క్రీడాభూ ర్భుజగనివహో భూషణ విధిః
 సమగ్రాసామగ్రీ జగతి విదితైవ స్మరరిపో
ర్యదేత స్యైశ్యర్యం తవ జనని సౌభాగ్యమహిమా!

అమ్మా!మన్మధుని బూడిదచేసిన ఆ శంకరుని వాహనమా ముసలి ఎద్దు
 ...ఆహారమా విషము...కట్టుపుట్టములా దిక్కులు..విహార భూమి -
స్మశానవాటిక, సొమ్ములా పాముల తుట్టెలు...ఆయనకున్న
 భాగ్యమేపాటిదో ఎల్లలోకాలు ఎగిరినదే గదా! అయినప్పటికి ఆయన
మహా ఐశ్వర్యవంతుడు .. తాను బూడిద పూసుకున్నా ఇతరులకు భూతి
నివ్వగల సంపన్నుడు. దీనికి నీ సౌభాగ్యమహిమే కారణం తల్లీ!
     
అశేష బ్రహ్మాండ ప్రలయ విధి నైసర్గిక మతిః
 స్మశానేష్వాసీనః కృత భసితలేపః  పశుపతిః,
దధౌ కంఠే, హాలాహల మఖిలభూగోల కృపయా
భవత్యా స్సంగత్యాః  ఫల మితిచ కల్యాణీ! కలయే.

హే మంగళప్రదాయినీ - కల్యాణీ! దేహమంతా విబూది పూసుకుని
స్మశానంలో తిష్టవేసికూర్చునే శివుడు సర్వలోకాలను సంహారకర్త అని
ప్రళయం కలిగిస్తాడని పేరు..కానీ, ఆ శివుడే సకల జీవరాసులను
కాపాడాలని కాలకుటాన్ని మ్రింగి కంఠాన బెట్టుకుని, సమస్త
భూగోళాన్ని దయామయుడై కాపాడాడంటే - అదంతా నీ చలవే -
సర్వమంగళదాయినీ .. నీతోడి సాంగత్యమే అందుకు కారణమని
భావిస్తున్నాను తల్లీ! 

విశాల శ్రీఖండ ద్రవ మృగమదా కీర్ణఘుసృణ
ప్రసూన వ్యమిశ్రం భగవతి! తవాభ్యంగ సలిలం
సమాదాయ స్రష్టా చలితపదపాంసూ న్నిజకరైః
సమాధత్తే సృష్టిం విబుధపుర పంకేరుహ దృశామ్.

హే భగవతీ! మంచిగంధపు రసం, కస్తూరి, కుంకుమ పూవుతో కూడిన
నీ తలంటి స్నానజలాన్ని, నీ పాదరజాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా తన
చేతులతో గ్రహించి ఆ స్నానజలంలోని నీ పాదధూళిని కలిపి పదునుచేసి
దేవలోకంలో కలువరేకులవంటి కన్నులు గల కాంతామణులను సృష్టిస్తున్నాడు - తల్లీ!

వసంతే సానందే కుసుమిత లతాభిః పరివృతే
స్ఫురన్నానాపద్మే సరసి కలహంసాలి సుభగే,
సఖీభిః  ఖేలంతీం మలయపవనాందోలిత జలే 
స్మరేద్యస్త్వాం తస్య జ్వరజనిత పీడా పరపతి.

తల్లీ జ్వరబాధ శాంతించాలంటే, ఆనందదాయకమైన వసంత
ఋతువులో - విరబూసిన లతతో - వికసించిన పద్మాలతో కలహంసల
బూరులతో కలకల్లాడే సరోవరంలో - మలయపవన వీచికలతో
మెల్లిమెల్లిగా కదులుతున్న జలాల్లో చెలులతో జలక్రీడలు చేస్తున్న
జగన్మాతను ధ్యానించిన వారికి జ్వరపీడ తొలగిపోతుంది
ఇతి శ్రీ శంకరాచార్య కృత - ఆనందలహరీ స్తోత్రం సంపూర్ణమ్.  

http://www.teluguone.com/tonecmsuserfiles/Durgadevi-RajarajeswariDevi%285%29.png
శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రం
(Sridevee Khadgamala Stotram)
శ్రీ చక్ర దేవతా మంత్రం

హ్రీంకారసనగర్భితానలశిఖాం – సౌ: క్లీం కళాం బిభ్రతీం

సౌవర్ణాంబరధారిణీం వరసుధా – దౌతాం త్రినేత్రోజ్జ్వలాం

వందే పుస్తకపాణి మంకుశధరాం – స్రగ్భూశితాముజ్జ్వలాం

త్వంగౌరీం త్రిపురాం పరాత్పరకళాం – శ్రీ చక్రసంచారిణిమ్

అస్య శ్రీ శుద్ధశక్తి మాలామహామంత్రస్య ఉపస్థెంద్రియాధిష్టాయీ

వరుణాదిత్య ఋషిః దైవీ గాయత్రీ చ్చందః సాత్త్వికకకారభట్టారక పీఠస్థిత

కామేశ్వరీ శ్రీలలితాపరాభట్టారికా దేవతా ఐం బీజం క్లీం శక్తి: సౌ: కీలకం,

మమ ఖడ్గసిద్ధ్యర్దే జపే వినియోగః మూల మంత్రేణ షడంగ న్యాసం కుర్యాత్.

ధ్యానం 

ఆరక్తాభాం త్రినేత్రా మరుణిమవసనాం – రత్నతాటంకరమ్యాం

హస్తాంభోజై స్సపాశాంకుశమదనధను – స్సాయకై ర్విస్ఫురంతీం

ఆపినోత్తుంగవక్షోరుహయుగవిలుఠ – త్తారహారోజ్జ్వలాంగీం

ధ్యాయే దంభోజహస్తా మరుణిమవసనా – మీశ్వరీ మీశ్వరాణామ్.

లమిత్యాది పంచపూజాం కుర్యాత్, యథాశక్తి మూలమంత్రం జపేత్.

శ్రీదేవీ సంబోధనమ్

ఓం ఐం హ్రీం ఐం క్లీం సౌ: ఓం ననస్త్రి పురసుందరి

అంగన్యాసదేవతానామభి: సంభోధనమ్

హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, నేత్రాదేవి, అస్త్రదేవి

తిథినిత్యాదేవతాః

కామేశ్వరి, భవమాలిని, నిత్యక్లి న్నే, భేరుండే, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే!

దివ్యౌఘగురవః 

పరమేశ్వర పరమేశ్వరి, మెత్రేశమయి, షష్టిషమయి, ఉడ్డిశమయి, చర్యానాథమయి, లోపాముద్రమయి, అగస్త్యమయి!

సిద్దౌఘగురవః 
కాలతాపనమయి, ధర్మాచార్యమయి, ముక్తకేశ్వరమయి, దీపకళానాథమయి!


మానవౌఘగురవః
అణిమాసిద్దే, లఘిమాసిద్దే, ఈశ్విత్వసిద్దే, ప్రాకామ్య సిద్దే, భుక్తిసిద్దే, ఇచ్చాసిద్దే, ప్రాప్తిసిద్దే, సర్వకామసిద్దే, (1. రేఖాయమ్)

బ్రహ్మ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి (2. ద్వితీరేఖయమ్)

సర్వసంక్షోభిణి, సర్వవద్రాచిణి, సర్వాకర్షిణి, సర్వవశకంరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరి, సర్వబీజే, సర్వయోనే, సార్వత్రిఖండే, (3. తృతీయ రేఖయమ్)

త్రైలోక్యమోహనచక్ర స్వామిని, ప్రకటయోగిని!

శ్రీ చక్ర ద్వితీయావరణదేవతాః

కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి. శబ్దాకర్షిణి, స్సర్శాకర్షిణి¸రూపాకర్షిణి, బీజాకర్షిణి¸ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వాశాపరిపూరకచక్ర స్వామిని, గుప్తయోగిని

శ్రీ చక్ర తృతీయావరణ దేవతాః 

అనంగకుసుమే, అనంగమేఖలే, ఆనందమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని, సర్వ సంక్షోభణ చక్రస్వమిని, గుప్తతరయోగిని!

శ్రీచక్రచతుర్ధావరణ దేవతాః

సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజ్రుంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వర్దసాధికే, సర్వసంపత్తిపూరణి, సర్వమంత్రమయి సర్వద్వంద్వంక్షయంకరి, సర్వసౌభాగ్య దాయని చక్రస్వామిని, సంప్రదాయయోగిని!

శ్రీ చక్ర పంచమావరణ దేవతాః

సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ర్పదే, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయిని, సర్వార్ధసాధకచక్రసామిని, కుళోత్తీర్ణయోగిని

శ్రీ చక్ర షష్టావరణ దేవతాః 

సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వేశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధివినాశిని, సర్వధారస్వరూపే, సర్వపాపహరే. సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాచక్రస్వామిని, నిగర్భయోగిని!

శ్రీ చక్రసప్తమావరణ దేవతాః

వశిని, కామేశ్వరి, మోదిని, విమలే. జయిని, సర్వేశ్వరి, కౌళిని, సర్వరోగహరచక్రస్వామిని, రహస్యయోగిని!

శ్రీ చక్రాష్టమావరణ దేవతాః 

బాణిని, చాషిని, అంకుషిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని, మహాశ్రీ సుందరి, సర్వసిద్ధిప్రదచక్రస్వామిని, అతిరహస్యయోగిని

శ్రీ చక్ర నవమావరణ దేవతాః 

శ్రీ శ్రీమహాభట్టారకే, సర్వానందమయచక్రస్వామిని, పరాపరరహస్యయోగిని!

నవచక్రేశ్వరీ నామాని 

త్రిపురే, త్రిపురేశి, త్రిపురసుందరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీ: త్రిపురమాలిని, త్రిపురాసిద్ధే, త్రిపురాంతకే. మహాత్రిపురసుందరి!

శ్రీదేవి విశేషణాని నమస్కారనవాక్షరీచ 

మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాష్శయే, మహామహాశ్రీచక్రనగరసామ్రాజ్ఞి నమస్తే, నమస్తే, నమస్తే.

ఫలశృతి
ఏషా విద్యా మహాసిద్ధి – దాయినీ స్మ్రతిమాత్రతః
అగ్ని వాతమహోక్షోభే – రాజ్ఞా రాష్ట్రస్య విప్లవే.
లుంఠనే తస్కరభయే – సంగ్రామే సలిలప్లవే
సముద్రయానవిక్షోభే – భూతప్రేతాదికే భయే.
అపస్మారజ్వరవ్యాధి – మృత్యుక్షామాదిజే భయే
శాకినీపూతనాయక్ష – రక్షః కూష్మాండజే భయే.
మిత్రభేధే గ్రహభయే – వ్యసనే శ్వాభిచారికే
అన్యేషశ్వపిచ దోషేషు – మాలామంత్రం స్మరే న్నరః
తాదృశం ఖడ్గ మాప్నోతి – యేన హస్తస్థి తేన వై,
అష్టాదిశ మహాద్వీప – సమ్రాద్భోక్తా భవిష్యతి.
సర్వోపద్రనిర్ముక్త – స్సాక్షా చ్చివమయో భవిత్
ఆపత్కాలే నిత్యపూజాం – విస్తరా త్కర్తు మారభేత్.
ఏకావారం జపధ్యానం – సర్వపూజాఫలం లభేత్
నవావరణదేవీనాం – లలితాయా మహోజసః
ఏకత్ర గణనారూపో – వేదవేదాంగగోచరః
సర్వాగమరహస్యార్ధః – స్మరణాత్ పాపనాశనీ.
లలితాయా మహేశాన్యా – మాలా విద్యా మహీయసీ
నరవశ్యం నరేంద్రాణాం – వశ్యం నారీశంకరమ్.
అణిమదిగుణైశ్వర్యం – రంజనం పాపభంజనం
తత్తదావరణస్థాయి – దేవతాబృందమంత్రకమ్.
మాలామంత్రం పరం గుహ్యం – పరం ధామ ప్రకీర్తితమ్
శక్తిమాలా పంచధా స్యా – చ్చివమాలా చ తాదృశీ
తస్మా ద్గోప్యతరా ద్గోప్యం – రహస్యం భుక్తి ముక్తిదమ్
ఇతి దేవీ ఖడ్గమాలా స్తోత్రమ్.

దుర్గాష్టమి విశిష్ఠత
దుర్గాష్టమిని మహాష్టమి లేక వీరాష్టమి అని కూడా అంటారు.ఈ దినం పూజింపబడే నవదుర్గ మాత “మహాదుర్గ”. కొన్ని చోట్ల అష్టమి రోజున మహాభగళ, నారాయణిదేవిని పూజించడం కద్దు.
దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు తల్లి నామం జపిస్తే తొలగిపోతాయి.
ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణం చెయ్యాలి. "ఓం దుం దుర్గాయైనమః" అనే మంత్రాన్ని పఠించాలి. పులగాన్నం నివేదనం చెయ్యాలి, దుర్గ, లలిత అష్టోత్తరాలు పఠించాలి.
ఈ దినం "ఆయుధ పూజ లేక అస్త్రపూజ" చేస్తారు (కొన్ని చోట్ల నవమి రోజు, మరికొన్ని చోట్ల దశమి రోజు కూడా చేస్తారు). తాము వాడే పనిముట్లని, సామాగ్రిని శుభ్రపరిచి, వాటికి పూజ చేస్తారు.
అలాగే నవరాత్రులలో ప్రతీ దినం "సుహాసినీ పూజ" చెయ్యడానికి అనుకూలమే ఐనా చాలాచోట్ల అష్టమిరోజున ప్రత్యేకంగా సుహాసినీ పూజ చేస్తారు. ఈ పూజలో ముత్తైదువు ఐన స్త్రీని అమ్మవారి స్వరూపంగా పూజించి, దక్షిణ, పండ్లు, కొత్తబట్టలూ సమర్పించి, భోజనం అర్పిస్తారు.
తెలంగాణా ప్రాంతంలో బతుకమ్మ పండుగ ఈ రోజున ప్రత్యేకంగా చేస్తారు. ఇది మహాలయ అమావాస్యరోజున మొదలై, అష్టమిరోజు ముగుస్తుంది. గౌరీ దేవిని బతుకమ్మగా కొలుస్తారు. భక్తులు అమ్మవారికి కుండలలో అన్నం వండుకొని, దానికి కుంకుమ కలిపి భక్తితో మెత్తపై పెట్టుకుని అమ్మవారి ఆలయానికి మోసుకుని వెళ్ళి సమర్పిస్తారు.ఈ రోజున ప్రత్యేకంగా బతుకమ్మ పాటలు పాడుతారు.
//విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణం
కన్యాభిః కరవాలఖేటి విలద్దస్తాభిరాసేవితాం
హస్తైశ్చక్రగదాసిఖే్టి విసిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే//

దుర్గ
దేవి షోడశోపచార పూజవిధి
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః,విష్ణవే నమః,
మధుసూదనాయ నమః,త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః,శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, 
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః
సంకల్పం
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి)ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన)ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి)తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,సర్వదేవతా స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్ధం యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
శ్రీ దుర్గాదేవిపూజాం కరిష్యే శ్రీ సువర్ణ కవచ లక్ష్మి దుర్గాదేవ్యై నమః
ధ్యానం:
శ్లో//చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః
శ్రీ దుర్గాదేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి
(పుష్పము వేయవలెను).



ఆవాహనం:
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజితస్రజాం
చంద్రాం హిరణ్మయీం జాతవేదో మ మావహ
శ్లో//శ్రీ వాగ్దేవిం మహాకాళిం మహాలక్ష్మీం సరస్వతీం
త్రిశక్తిరూపిణీ మంబాం దుర్గాంచండీం నమామ్యహమ్
శ్రీ దుర్గాదేవ్యైనమః ఆవాహయామి
(పుష్పము వేయవలెను).
ఆసనం:
తాం ఆవహజాతదో లక్ష్మీమనపగామినీమ్ యస్యాం హిరణ్యం
విందేయంగామశ్వం పురుషానహమ్
శ్లో//సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే
రత్న సింహాసనమిధం దేవీ స్థిరతాం సురపూజితే
శ్రీ దుర్గాదేవ్యైనమః ఆసనం సమర్పయామి
(అక్షతలు వేయవలెను.)
పాద్యం:
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రభోధినీం
శ్రియం దేవీముపహ్వమే శ్రీర్మాదేవిజుషతాం
శ్లో//సువాసితం జలంరమ్యం సర్వతీర్థ సముద్భవం
పాద్యం గృహణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే
శ్రీ దుర్గాదేవ్యైనమః పాదయోః పాద్యం సమర్పయామి
(నీరు చల్లవలెను.)
అర్ఘ్యం:
కాంసోస్మి తాం హిరణ్య ప్రాకార మార్ద్రాంజ్వలంతిం తృప్తాం తర్పయంతీం
పద్మేస్ఠఃఇతాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం
శ్లో//శుద్దోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దాశ్యామి తే దేవి గృహణ సురపూజితే
శ్రీ దుర్గాదేవ్యైనమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి
(నీరు చల్లవలెను.)
ఆచమనం:
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతిం శ్రియంలోకేదేవజుష్టా ముదారం
తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీ ర్మేనశ్యతాం త్వాం వృణే.
శ్లో//సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతాం
మధుపర్కం గృహాణత్వాం దుర్గాదేవి నమోస్తుతే
శ్రీదుర్గాదేవ్యైనమః ఆచమనీయం సమర్పయామి
(నీరు చల్లవలెను.)

మధుపర్కం:
(పెరుగు,తేనె,నేయి,నీరు,పంచదార వీనిని మధుపర్కం అంటారు.)
శ్లో//మధ్వాజ్యదధిసంయుక్తం శర్కరాజలసంయుతం
మఢఃఉపర్కం గృహాణత్వం దుర్గాదేవి నమోస్తుతే
శ్రీ దుర్గాదేవ్యైనమః మధుపర్కం సమర్పయామి
(పంచామృత స్నానానికి ముందుగా దీనిని దేవికి నివేదన చేయాలి.పంచామృతాలతో సగం అభిషేకించి మిగిలిన దనిని దేవికి నైవేద్యంలో నివేదన చేసి స్నానజలంతో కలిపి ప్రసాద తీర్ధంగా తీసుకోవాలి.)
పంచామృతస్నానం:
శ్లో//ఓం ఆప్యాయస్య సమేతు తే విశ్వతస్సోమ 
వృష్టియంభవావాజస్య సంగథే
శ్రీ దుర్గాదేవ్యైనమః క్షీరేణ స్నపయామి.
(దేవికి పాలతో స్నానము చేయాలి)
శ్లో//ఓం దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణరశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్ప్రన ఆయూగం షి తారిషత్
శ్రీ దుర్గాదేవ్యైనమః దధ్నా స్నపయామి.
(దేవికి పెరుగుతో స్నానము చేయాలి)
శ్లో//ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా
తచ్చి ద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్శిభిః
శ్రీ దుర్గాదేవ్యైనమః అజ్యేన స్నపయామి.
(దేవికి నెయ్యితో స్నానము చేయాలి)
శ్లో// ఓం మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః
మాధ్వీర్నస్సంత్వోషధీః,మధునక్తముతోషసి మధుమత్పార్థివగంరజః
మధుద్యౌరస్తునః పితా,మధుమాన్నొ వనస్పతిర్మధుమాగుం
అస్తుసూర్యః మాధ్వీర్గావో భ్వంతునః
శ్రీ దుర్గాదేవ్యైనమః మధునా స్నపయామి.
(దేవికి తేనెతో స్నానము చేయాలి)
శ్లో//ఓం స్వాదుః పవస్వ దివ్యాజన్మనే స్వాదురింద్రాయ సుహవీతునమ్నే,
స్వాదుర్మిత్రాయ వరుణాయవాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః
శ్రీ దుర్గాదేవ్యైనమః శర్కరేణ స్నపయామి.
(దేవికి పంచదారతో స్నానము చేయాలి)
ఫలోదకస్నానం:
శ్లో//యాః ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగం హసః
శ్రీ దుర్గాదేవ్యైనమః ఫలోదకేనస్నపయామి.
(దేవికి కొబ్బరి నీళ్ళుతో స్నానము చేయాలి)
శ్రీదుర్గాదేవ్యైనమః పంచామృత స్నానాంతరం శుద్దోదక స్నానం సమర్పయామి.
స్నానం:
ఆదిత్యవర్ణే తపోసోధి జాతో వనస్పతి స్తవవృక్షో థబిల్వః
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ
శ్లో//గంగాజలం మయానీతం మహాదేవ శిరస్ఠఃఇతం
శుద్దోదక మిదం స్నానం గృహణ సురపూజితే
శ్రీ దుర్గాదేవ్యైనమః స్నానం సమర్పయామి
(దేవికి నీళ్ళుతో స్నానము చేయాలి/ నీరు చల్లాలి)
వస్త్రం:
ఉపై తుమాం దేవ సఖః కీర్తిశ్చ మణినాసహ
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రేస్మికీర్తిమృద్ధిం దదాతుమే.
శ్లో//సురార్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహణ సురపూజితే
శ్రీ దుర్గాదేవ్యైనమః వస్త్రయుగ్మం సమర్పయామి.
ఉపవీతం:
క్షుత్పిపాసా మలాంజ్యేష్టాం అలక్ష్మీర్నాశయా మ్యహం
అభూతి మసమృద్ధించ సర్వా న్నిర్ణుదమే గృహతే
శ్లో//తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ వీభూషితం 
ఉపవీతం ఇదం దేవి గృహణత్వం శుభప్రదే
శ్రీ దుర్గాదేవ్యైనమః ఉపవీతం (యజ్ఞోపవీతం) సమర్పయామి.
గంధం:
గంధం ద్వారాందురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం
ఈశ్వరీగం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియం.
శ్లో//శ్రీఖంఠం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం
విలేపనం సురశ్రేష్ఠే చందనం ప్రతిగృహ్యతాం
శ్రీ దుర్గాదేవ్యైనమః గంధం సమర్పయామి
(గంధం చల్లవలెను.)
ఆభరణములు:
శ్లో//కేయూర కంకణ్యైః దివ్యైః హారనూపుర మేఖలా
విభూష్ణాన్యమూల్యాని గృహాణ సురపూజితే
శ్రీ దుర్గాదేవ్యైనమః ఆభరణార్ధం అక్షతాన్ సమర్పయామి.
పుష్పసమర్పణం (పూలమాలలు):
మనసఃకామ మాకూతిం వాచస్పత్యమశీమహి
పశూనాగం రూపామన్నస్య య శ్శ్రీ శ్రయతాం యశః.
శ్లో//మల్లికాజాజి కుసుమైశ్చ చంపకా వకుళైస్థథా
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరప్రియే
శ్రీ దుర్గాదేవ్యైనమః పుష్పాంజలిం సమర్పయామి.
పసుపు:
అహిరివభోగైః పర్యేతి బాహుం జ్యాయాహేతిం పరిబాధ్మానః
హస్తఘ్నో విశ్వావయునాని విద్వాన్ పుమాన్ పుమాగంసం పరిపాతు విశ్వతః //
హరిద్రా చూర్ణమేతద్ది స్వర్ణకాంతి విరాజితం
దీయతే చ మహాదేవి కృపయా పరిగృహ్యతామ్ //
ఓం శ్రీ మహాకాళీ.......దుర్గాంబికాయై నమః హరిచంద్రాచూర్ణం సమర్పయామి.
కుంకుమ:
యాగం కుర్యాసినీవాలీ యా రాకా యా సరస్వతీ
ఇంద్రాణీ మహ్య ఊత మేవరూణానీం స్వస్తయే //
ఓం శ్రీ మహాకాళీ......దుర్గాంబికాయైనమః కుంకుమ కజ్జలాది సుగంద ద్రవ్యాణి సమర్పయామి.
అథాంగపూజా:
దుర్గాయైనమః - పాదౌ పూజయామి
కాత్యాయన్యైనమః - గుల్ఫౌ పూజయామి
మంగళాయైనమః - జానునీ పూజయామి
కాంతాయై నమః - ఊరూ పూజయామి
భద్రకాళ్యై నమః - కటిం పూజయామి
కపాలిణ్యై నమః - నాభిం పూజయామి
శివాయై నమః - హృదయం పూజయామి
జ్ఞానాయై నమః - ఉదరం పూజయామి
వైరాగ్యై నమః - స్తనౌ పూజయామి
వైకుంఠ వాసిన్యై నమః - వక్షస్థలం పూజయామి
దాత్ర్యై నమః - హస్తౌ పూజయామి
స్వాహాయై నమః - కంఠం పూజయామి
స్వధాయై నమః - ముఖం పూజయామి
నారాయణ్యై నమః - నాశికాం పూజయామి
మహేశ్యై నమః - నేత్రం పూజయామి
సింహవాహనాయై నమః - లలాటం పూజయామి
రుద్రాణ్యై నమః - శ్రోత్యే పూజయామి
శ్రీ దుర్గాదేవ్య నమః - సర్వాణ్యంగాని పూజయామి
తదుపరి ఇక్కడ ఏ రోజు ఏ దేవిని పూజిస్తారో ఆరోజు ఆ దేవి అష్టోత్తరము చదువవలెను.
తదుపరి ఈ క్రింది విధము గా చేయవలెను
ధూపం:
కర్దమేన ప్రజా భూతా సంభవ కర్దమ శ్రియం వాసయమేకులే మాతరం పద్మమాలినీమ్ 
శ్లో//వనస్పత్యుద్భవైర్ధివ్యై ర్నానాగందైః సుసంయుతః
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
శ్రీ దుర్గాదేవ్యైనమః ధూపమాఘ్రాపయామి.

దీపం:
అపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహనిచ
దేవీం మాత్రం శ్రియం వాసయమేకులే.
శ్లో//సాజ్యమేకార్తిసంయుక్తంవహ్నినాయోజితంప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం
భక్తాదీపం ప్రయచ్చామి దేవ్యైచ పరమాత్మనే
త్రాహిమాం నరకాద్ఘోరా ద్దివ్య జ్యోతిర్నమోస్తుతే
శ్రీ దుర్గాదేవ్యైనమః దీపం దర్శయామి
నైవేద్యం:
ఆర్ద్రాంపుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలీనీమ్ 
చంద్రాం హిరన్మయీం లక్ష్మీం జాతవేదోమమా అవహ.
శ్లో//అన్నం చతురిధం స్వాదు రసైః సర్పిః సమనిత్వం
నైవేద్యం గృహ్యతాం దేవి భక్తిర్మే హ్యచలాంకురు
(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)
ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా, 
ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా 
ఓం సమనాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అమృతాభిధానమపి - ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ పక్షాళయామి - పాదౌ ప్రక్షాళయామి - శుద్దాచమనీయం సమర్పయామి.
తాంబూలం:
ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమ మాలినీం
సూర్యాం హిరన్మయీం లక్ష్మీం జాతవేదోమమా అవహ.
శ్లో//పూగీఫలైశ్చ కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతం
కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీ దుర్గాదేవ్యైనమః తాంబూలం సమర్పయామి
నీరాజనం:
తాం మ అవహజాతవేదో లక్ష్మీమనపగామినీం య స్యాంహిరణ్యం 
ప్రభూతంగావోదాస్యోశ్యాన్ విధేయం పురుషానహమ్ 
శ్లో//నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహేణ సురపూజితే
సంతత శ్రీరస్తు,సమస్తమంగళాని భవంతు,నిత్యశ్రీరస్తు,నిత్యమంగళాని భవంతు.
శ్రీ దుర్గాదేవ్యైనమః కర్పూర నీరాజనం సమర్పయామి
(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)




మంత్రపుష్పమ్:
జాతవేదసే సుననామ సోమమరాతీయతో నిదహాతి వేదః /
సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః //
తామగ్ని వర్ణాం తపసాజ్వలంతీం వైరో చనీం కర్మ ఫలేషు జుష్టామ్
దుర్గాం దేవీగం శరణమహం పపద్యే సుతరసి తరసే నమః
అగ్నే త్వం పారయా నవ్యో అస్మాన్ స్వస్తిభి రతి దుర్గాణి విశ్వా
పూశ్చ పృథ్వీ బహులాన ఉర్వీ భవాతోకాయ తనయాయ శంయోః
విశ్వాని నోదుర్గహా జాతవేద స్సింధుం ననావా దురితాతి పర్షి
అగ్నే అత్రివన్మనసా గృహణానో స్మాకం బోధ్యవితా తనూనామ్
పృతనాజితగం సహమాన ముగ్ర మగ్నిగం హువేమ పరమాత్సధస్దాత్
సనః పర్షదతి దుర్గాణి విశ్వక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః
ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి
స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యంచ సౌభగ మాయజస్వ
గోభి ర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణొ రనుసంచరేమ
నాకస్య పృష్ఠ మభిసంవసానో వైష్ణవీం లోక ఇహ మదయంతామ్
కాత్యాయనాయ విద్మహే కన్య కుమారి దీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ //
ఓం తద్భ్రహ్మా / ఓం తద్వాయుః / ఓం తదాత్మా / ఓం తత్సత్యం /ఓం తత్సర్వం /
ఓం తత్సురోర్నమః /అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు /త్వయజ్ఞస్త్వం /
వషట్కారస్త్వం మింద్రస్త్వగం / రుద్రస్త్వం /విష్ణుస్త్వం / బ్రహ్మత్వం /
ప్రజాపతిః / త్వంతదాప అపోజ్యోతి రసోమృతం బ్రహ / భూర్భువస్సువరోం
ఓం శ్రీ మహాకాళీ....దుర్గాంబికాయై నమః సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి.
సాష్టాంగ నమస్కారం:
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పధ్బ్యాం కరభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే
శ్రీ దుర్గాదేవ్యైనమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి
ప్రదక్షిణ
(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)
శ్లో//యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి
శ్రీ దుర్గాదేవ్యైనమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.


ప్రార్ధనం:
శ్లో// సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి స్వరూపిణి
పూజాం గృహాణ కౌమురి జగన్మాతర్నమోస్తుతే
శ్రీ దుర్గాదేవ్యైనమః ప్రార్దనాం సమర్పయామి
సర్వోపచారాలు:
చత్రమాచ్చాదయామి,చామరేణవీచయామి,నృత్యందర్శయామి,
గీతంశ్రాపయామి,ఆందోళికంనారోహయామి
సమస్తరాజోపచార పూజాం సమర్పయామి.
శ్రీ దుర్గాదేవ్యైనమః సర్వోపచారాన్ సమర్పయామి
క్షమా ప్రార్థన:
(అక్షతలు నీటితో పళ్ళెంలో విడువవలెను)
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశవ్రి
యాత్పూజితం మాయాదేవీ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మిక
శ్రీ దుర్గాదేవ్యైనమః సుప్రీతా స్సుప్రసన్నో వరదో భవతు సమస్త సన్మంగళాని భవంతుః
శ్రీ దేవి పూజావిధానం సంపూర్ణం
(క్రింది శ్లోకమును చదువుచు అమ్మవారి తీర్థమును తీసుకొనవలెను.)
అకాల మృత్యుహరణమ్ సర్వవ్యాది నివారణం
సర్వపాపక్షయకరం శ్రీదేవి పాదోదకం శుభమ్ //
(దేవి షోడశోపచార పూజ సమాప్తం.)